mahesh babu in double role......

బిజినెస్ మ్యాన్ 2 చేస్తానని పూరీ టీవి నైన్ కి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పగానే ఆ కథ ఎలా ఉంటుందనే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. అప్పుడే ఓ కథ ప్రచారంలోకి వచ్చింది. ఆ కథ ప్రకారం మహేష్ ద్వి పాత్రాభినయం చేస్తాడు. పోకిరిలోని ఎసిపి కృష్ణ మనోహర్(మహేష్) తన లవర్ ఇలియానాని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాడు. ఈ లోగా అతనికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి కాల్ వస్తుంది. ముంబైలో ఉన్న సూర్య భాయ్(మహేష్)ని పట్టుకోమని. అప్పుటికే దావూద్ ఇబ్రహీం రేంజిలో సూర్య భాయ్ తన లవర్ కాజల్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యి ముంబైలో దందాలు చేస్తూంటాడు. ఇప్పుడు మనోహర్ రంగంలోకి దిగి ఆ మాఫియా డాన్ ని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. వీరిద్దరి మధ్యన వార్ మొదలవుతుంది. అప్పుడేం జరుగుతుందనేది కథ అంటూ ఈ స్టోరీలైన్ ప్రచారం అవుతోంది.

ఈ చిత్రాన్ని సైతం ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారే చేస్తారని చెప్తున్నారు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చే ఈ చిత్రంలో కాజల్,ఇలియానా హీరోయిన్స్ చేస్తారని,డబుల్ బొనాంజాగా అభిమానులు ఎంజాయ్ చేస్తారని చెప్పుకుంటున్నారు. మళ్లీ సెప్టెంబర్ లో సెట్స్ మీదకు పంపి వచ్చే సంక్రాంతికి విడుదల చేద్దామని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది నిజమైనా కాకపోయినా కథ మాత్రం వింటానికి ఇంట్రస్టింగ్ గా ఉంది కదా.
 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best WordPress Themes